NTV Telugu Site icon

CM Revanth Reddy: హరీష్, కేటీఆర్, ఈటెలకు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్

Cm Revanth Reddy

Cm Revanth Reddy

హరీష్.. కేటీఆర్.. ఈటెలకు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. మూడు నెలలు.. పేదలు కాళీ చేసిన ఇండ్లలో ఉండాలని.. కిరాయి తానే కడతానన్నారు. మూడు నెలలు అక్కడే ఉండి రాజకీయం చేయాలన్నారు. దాన కిషోర్ .. వాళ్లకు భోజనం కూడా పంపిస్తారని చెప్పారు. మూడు నెలలు మీరు అక్కడే ఉండాలని పునరుద్ఘాటించారు. మూసి ప్రక్షాళన ఆపెస్తే.. టెండర్ అగ్రిమెంట్‌కి నష్టం జరిగితే తన సొంత ఆస్తి అమ్మి కడతానని ముఖ్యమంత్రి అన్నారు. మూసి పాపంలో.. మమ్మల్ని కూడా నేరగాళ్లను చేయాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. మూసి పునరుజ్జీవం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ని రోజులు చర్చిస్తారో చర్చించాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఏం చేద్దామో చెప్పండని.. ఈటెల.. కిషన్ రెడ్డి.. చేవెళ్ల ఎంపీల సూచనలు అడిగారు. వారు కూడా అసెంబ్లీకి రావాలని ఆహ్వానించారు. శాసనసభలో ప్రొవిజన్ ఉందని.. న్యాయ సలహా తీసుకుని ఎంపీలను కూడా సభలోకి తీసుకువస్తామన్నారు.

READ MORE: Minister Atchannaidu: కేరళ తరహాలో తీర ప్రాంత అభివృద్ధి.. వేట నిషేధ భృతి అమలుకు చర్యలు

సలహాలు ఇవ్వాలని.. మీ మీ అనుమానాలు తనకు పంపమని సీఎం కోరారు. శనివారంలోపు తనకు ప్రశ్నలు పంపాలని సూచించారు. ప్రతి ప్రశ్నకూ సమాధానమిస్తానని స్పష్టం చేశారు. సభలో చర్చ పెడతామని.. మూసి చేయాలా వద్దా? నల్గొండ కమ్యూనిస్టులు కూడా చెప్పాలన్నారు. రాజకీయ పార్టీలతో సంప్రదింపుల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

READ MORE:Nidhhi Agerwal: ఒకే రోజు.. రెండు రాష్ట్రాల్లో రెండు సినిమాల షూట్!