కరీంనగర్‌లో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ఇటీవల మరణించారు. అయితే.. ఆయన దశ దినకర్మ కార్యక్రమానికి హాజరు కానున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా మంత్రి గంగుల కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. సోమవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ చేరుకుంటారని సమాచారం. కాగా మంత్రి గంగుల తండ్రి మల్లయ్య(87) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ నెల 18 ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున్న బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది బీఆర్‌ఎస్.
Also Read : Naatu Naatu: వెస్ట్రన్ గడ్డపై మన నాటు డాన్స్ హవా…
ఈ సభకు సుమారు 5 లక్షల మంది జనసమీకరణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఈ బహింరగ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరవుతారని ముందునుంచి చెప్పుకొస్తున్నారు. అయితే.. తెలంగాణ సరిహద్దు జిల్లా కావడంతో.. 3 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ సభలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్‌ఎస్ నేతలు పరిశీలించారు. దాదాపు ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తోంది.
Also Read : Virat Kohli: శ్రీలంకపై కోహ్లీ సెంచరీ.. నమోదైన రికార్డులివి.. వరల్డ్‌లోనే తొలి ఆటగాడిగా..