ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులు అని అన్నారు సీఎం కేసీఆర్. కోకాపేటలో ‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్) శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుభవజ్జులైన గొప్ప గొప్ప మేధావులను, నోబుల్ లారేట్లను కూడా పిలిచి నాయకత్వ శిక్షణనిప్పిస్తామన్నారు. అంతేకాకుండా.. ‘ప్రజలకు సుపరిపాలన నందించే నాయకత్వాన్ని తీర్చిదిద్దుతాం. పొలిటికల్ ఎక్సలెన్స్ అండ్ హెచ్ ఆర్ డీ’ కేంద్రాన్ని తీర్చిదిద్దాలనే నిర్ణయం. రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో శిక్షణనిచ్చేందుకు దేశం నలు మూలలనుంచి అనుభవజ్జులైన రాజనీతి శాస్త్రజ్జులు, ఆర్థిక వేత్తలు సామాజిక వేత్తలు సమాజాభివృద్ధికి దోహదం చేసే రచయితలు ప్రొఫెసర్లు విశ్రాంత అధికారులు తదితరులను ఆహ్వానిస్తం.
Also Read : Adipurush: హనుమంతుడి కోసం ఒక సీటు.. వావ్.. ఏం నమ్మకం ఇచ్చారయ్యా
దేశం నలుమూలలనుంచి వచ్చే సామాజిక కార్యకర్తలకు రాజకీయ వేత్తలకు నాయకులకు భారత్ భవన్ లో సమగ్రమైన సమస్త సమాచారం లభ్యమౌతుంది. శిక్షణ కోసం వచ్చే వారికోసం, శిక్షణ పొందే వారి కోసం వసతులను ఏర్పాటు, శిక్షణకు అనుగుణంగా.. తరగతి గదులు, ప్రొజెక్టర్ తో కూడిన మినిహాల్స్, విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక సాంకేతికత కలిగిన డిజిటల్ లైబ్రరీలు, వసతికోసం లగ్జరీ గదులు నిర్మితమౌతాయన్నారు. దేశ విదేశాల వార్తా పత్రికలు అందుబాటులో వుంటాయని, ప్రపంచ రాజకీయ సామాజిక తాత్విక రంగాలకు చెందిన ప్రపంచ మేధావుల రచనలు, గ్రంధాలు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్ భవన్ కు కేటాయించిన స్థలంలోని కొంతమేరకే భవన నిర్మాణం చేపడుతామని, మిగిలిన స్థలమంతా పచ్చదనమని, నాయకత్వ శిక్షణ కోసం ఇక్కడకు వచ్చే వారికి విశాల ప్రాంతంలో ఆహ్లాదకరవాతావరణంలో శిక్షణ బోధన ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Also Read : JIO 5G: జియో వినియోగదారులకు శుభవార్త.. తెలంగాణలోని 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు