ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ అందిస్తోంది. ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ లో స్మార్ట్ ఫోన్ లవర్స్ కు అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. సామ్ సంగ్ కు చెందిన Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఏకంగా 39 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మతిపోయే ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ పై మీరూ ఓ లుక్కేయండి. బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ పై ఇంతకన్నా బెస్ట్ డీల్ ఉండదేమో.
అమెజాన్ లో Samsung Galaxy M35 5G (6GB RAM,128GB) వేరియంట్ అసలు ధర రూ. 24,499గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 14999 కే సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ఆఫర్ యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే అదనంగా రూ. వెయ్యి తగ్గుతుంది. అంటే అప్పుడు మీకు ఈ ఫోన్ రూ. 13,999కే వచ్చేస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పూర్తి HD+ sAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Exynos 1380 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం, Galaxy M35 5G ట్రిపుల్ రియర్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఇందులో 50 MP ప్రధాన కెమెరా, 8 MP సెకండరీ కెమెరా, 2 MP సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం, 13 MP ఫ్రంట్ కెమెరా తో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత OneUI 6.1 OS పై రన్ అవుతుంది. రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ను అందించారు. ఈ ఫోన్ లో సైడ్ -మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యాక్సిలరో మీటర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. Samsung Wallet ద్వారా ట్యాప్ & పే ఫీచర్‌ని యూజ్ చేసుకోవచ్చు.