Robinhood : హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మార్చి 28న థియేటర్లలోకి రాబోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర చేస్తున్నాడు. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. నితిన్ మాట్లాడుతూ.. ‘భీష్మ సినిమా కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ అవుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టను పెంచేలా ఉంటుంది. సినిమాను చూసిన ప్రేక్షకులు కొత్త ఎక్స్ పీరియన్స్ ను చూస్తారు. ఆడియన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇందులో నా క్యారెక్టర్ కు మెంటర్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఛాలెంజింగి క్యారెక్టర్. చాలా ట్విస్టులు, సర్ ప్రైజ్ లతో ఫ్రెష్ గా ఉంటుంది’ అన్నారు.
Read Also : Harsha Vardan : ఆమెతో ఏడేళ్ల లవ్.. అందుకే బ్యాచిలర్ గా ఉండిపోయా : హర్ష వర్ధన్
వెంకీ కుడుముల మాట్లాడుతూ.. సినిమా ఔట్ పుట్ ను ఆల్రెడీ చూశామని.. చాలా బాగా వచ్చిందన్నారు. ఈ మూవీని ప్రేక్షకులు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తారని నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు. సినిమాలో మంచి సర్ ప్రైజ్ ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులు మంచి ఎక్స్ పీరియన్స్ ను చూస్తారన్నారు. ఆస్ట్రేలియా షెడ్యూల్ లోనే డేవిడ్ వార్నర్ పాత్ర ఎంట్రీ ఉంటుందని.. అక్కడ మంచి మ్యాజిక్ ఉంటుందన్నారు. దాన్ని థియేటర్లలో చూస్తేనే థ్రిల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమా మొత్తం కామెడీతో నింపేశామని.. అక్కడక్కడా హార్ట్ టచింగ్ సీన్లు కూడా ఉంటాయన్నారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ఈ మూవీని కామెడీ బేస్డ్ గా తీశామన్నారు. ప్రేక్షకులకు మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా తీశామని తెలిపారు. వెంకీ కుడుములకు మూవీ నిర్మాణంపై మంచి పట్టు ఉందని.. అందుకే ఎక్కువగా తాము ఇన్వాల్వ్ కాలేదన్నారు. తమకు పోటీగా మూడు సినిమాలు వస్తాయనుకోలేదన్నారు. టికెట్ రేట్లు కేవలం 5 శాతం మార్చామని.. 95 శాతం పాత రేట్లే ఉన్నాయని చెప్పారు.