CM Revanth Reddy: లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేశారు. ఈనేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా జన్మ ధన్యమైందన్నారు. లక్షలు మంది రైతుల ఇండ్లలో సంతోషంతో మా జన్మ ధన్యమైందని తెలిపారు. రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యం అని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్పోరేట్ కంపెనీలు లక్షలాది కోట్లు బ్యాంకులకు ఎగవేస్తున్నారని అన్నారు. బ్యాంకులను మోసం చేయాలని ఉద్దేశంతోటే రుణాలు తీసుకుంటున్నారు, కానీ రైతు తీసుకున్న అప్పు కట్టి తీరతారు అని తెలిపారు. మీరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నప్పుడు అందరూ అవహేళన చేశారని, గతంలో మాఫీ చేస్తానన్న వాళ్ళు లక్ష రూపాయలకు మిత్తి మిగిలేటట్టు వ్యవహరించారని అన్నారు. 7000 కోట్లు రైతులపై మొండి బకాయిలుగా వదిలేసింది గత ప్రభుత్వమని మండిపడ్డారు. పదేళ్లలో 25 వేల కోట్లు కూడా గత ప్రభుత్వం చెల్లించలేకపోయిందన్నారు. కొందరు మాపై శాపనార్ధాలు పెట్టారని అన్నారు.
Read also: Mallu Bhatti Vikramarka: రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది..
ఇది మా చిత్తశుద్ధి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన దక్షతకు ఇది నిదర్శనం అన్నారు. దేశభద్రత ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ అని తెలిపారు. ఆహార భద్రత .. విత్తన సబ్సిడీ ..వ్యవసాయ పనిముట్లకి సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్.. రైతు బీమా ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. జూలై ఆగస్టు నెలలో చరిత్రలో లిఖించ దగ్గ నెలలు అన్నారు. ఏ రాష్ట్రంలో 31 వేల కోట్ల రుణాలు మాఫీ ఏకకాలంలో చేయలేదన్నారు. ఇది మా ప్రభుత్వ చరిత్ర అని తెలిపారు. ఎన్నికలు లేనప్పుడే మేము రుణమాఫీ చేస్తున్నామన్నారు. కార్పొరేట్ కంపెనీల లాగా బ్యాంకర్లను మేము వన్ టైం సెటిల్మెంట్ అడగలేదన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని ఫుల్ టైం సెటిల్మెంట్ చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులు ఆత్మగౌరవంతో ఉండాలని ఆకాంక్ష మాదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Srisailam Dam Gates Lifted: పెరిగిన వరద ఉధృతి.. శ్రీశైలం డ్యామ్ మరో రెండు గేట్లు ఎత్తివేత..