Baba Ramdev: గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం (GFST) ఆధ్వర్యంలో జరుగుతున్న టూరిజం కాంక్లేవ్‌లో పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును విజనరీ నేతగా అభివర్ణించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి ఆయన పాత్ర ఎనలేనిదని కొనియాడారు. సీఎం చంద్రబాబు కేవలం రాజకీయ నేత కాదు.. ఒక విజనరీ. ఆయనకు అభివృద్ధిపై స్పష్టమైన దృక్కోణం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపించిన అభివృద్ధికి ఆయనే కారణం. ఆయన దృక్పథం వల్లే ఈ రెండు రాష్ట్రాలు ముందడుగు వేశాయి అంటూ బాబా రాందేవ్ ప్రశంసించారు.
Read Also:CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని ఉద్యోగం నుండి తొలగింపు.. హైకోర్టు మద్దతు
ఇక రాష్ట్రంలో పతంజలి సంస్థ పెట్టుబడుల గురించి ఆయన మాట్లాడుతూ.. మేము ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టుతున్నాం. ఇది మా లాభాల కోసం కాదు, భారతదేశ అభివృద్ధి కోసం. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్నదే. త్వరలో హార్స్లీ హిల్స్ లో ఐకానిక్ వెల్నెస్ సెంటర్ స్థాపిస్తామని.. ఆ కేంద్రం ద్వారా ఆ ప్రాంతం జాతీయ, అంతర్జాతీయ పర్యాటక పటముపై గుర్తింపు పొందేలా చూస్తాం అని అన్నారు.
Read Also:Electric Bike Explode: ఎలక్ట్రిక్ బైక్ పేలుడు.. మహిళ స్పాట్ డెడ్..!
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించిన బాబా రాందేవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆ రాష్ట్రం భారత పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసడర్‌గా మారే రోజు దూరం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టూరిజం రంగంలో కొనసాగుతున్న ఉత్సవాలను కూడా ఆయన ప్రశంసించారు.