CBIL Score: ప్రస్తుత రోజుల్లో సిబిల్ స్కోర్ ఎంత ప్రధానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆర్థికపరమైన అవసరాలకు సంబంధించైనా సరే ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ ఉపయోగించుకుని అనేక ఆర్థికపరమైన చర్యలను చేపట్టవచ్చు. ముఖ్యంగా లోన్ సంబంధించిన విషయంలో ఈ సిబిల్ స్కోర్ ఉపయోగపడుతుంది. ఈ సిబిల్ స్కోర్ వ్యక్తి తీసుకున్న సరైన సమయంలో చెల్లింపుల పై ఆధారపడి ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళితే..
Read Also:YS Jagan: జగన్ క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా..!
సిబిల్ స్కోర్ తక్కువగా ఉందన్న కారణంతో ఉద్యోగిని తొలగించిన ఘటన చోటు చేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా చెన్నై హైకోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా ప్రజాధనాన్ని నిర్వహించే ఉద్యోగుల వద్ద ఆర్థిక క్రమశిక్షణ ఉండాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కార్తికేయన్ అనే వ్యక్తి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) గా పని చేస్తున్నారు. అయితే, అతడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో ఎస్‌బీఐ అతడిని ఉద్యోగం నుండి తొలగించింది.
Read Also:Maharashtra: హిందీ భాషపై పోరాటానికి ఉద్ధవ్, రాజ్ థాక్రే సన్నాహాలు.. శరద పవార్ మద్దతు
అయితే, తన తొలగింపును రద్దు చేయాలని కోరుతూ కార్తికేయన్ చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. లోన్లు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా సిబిల్ స్కోర్‌ను బాగుండనివారిపై బ్యాంక్ ఎలా నమ్మకాన్ని కలిగి ఉండగలదు..? అలాంటి వ్యక్తులకు ప్రజల డబ్బు నిర్వహించే బాధ్యత ఎలా ఇవ్వగలరు..? అని ప్రశ్నించింది. దీనితో పాటు ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పుతో ఉద్యోగులు సిబిల్ స్కోర్ వంటి ఆర్థిక ప్రవర్తనల ప్రాముఖ్యత మరింత బలపడనుంది.