Electric Bike Explode: కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్‌కు పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారిగా పేలింది. అదేసమయంలో ఆ వాహనం పక్కనే నిద్రిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక పోలీసుల సమాచారం మేరకు వెంకట లక్ష్మమ్మ అనే మహిళ తన ఇంటి వరండాలో ఎలక్ట్రిక్ బైక్ కు ఛార్జింగ్ పెడుతూ, అదే చోట ఉన్న సోఫాలో నిద్రించడంతో ప్రమాదం జరిగింది.
Read Also:Singam Style Police: సినిమా స్టైల్లో రౌడీ షీటర్‌ను పట్టుకునేందుకు ఎస్ఐ ఛేజింగ్..
తెల్లవారుజామున బైక్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో నిద్రిస్తున్న లక్ష్మమ్మ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా కాలిపోయింది. ఆ తర్వాత సంఘటన దాటికి స్థలంలోనే ఆమె మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదచాయలు నెలకొన్నాయి.