Uppu Kappurambu : కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కామెడీతో పాటు డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ కు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇప్పుడు సినిమాకు బజ్ పెరుగుతోంది. ఇందులో కాటికాపరిగా సుహాస్ నటిస్తుండగా.. కీర్తి సురేష్ గ్రామ అధికారి పాత్రలో కనిపిస్తోంది. మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా కీర్తి, సుహాస్ కీలక విషయాలను పంచుకున్నారు. మూవీని చాలా తక్కువ టైమ్ లో షూట్ చేసినట్టు తెలిపారు.
Read Also : Manchu Vishnu : అతని వల్లే కన్నప్ప వాయిదా వేశా.. మంచు విష్ణు సీక్రెట్ రివీల్..
మూవీని 28 రోజుల్లోనే షూట్ చేశామన్నారు. ఇందులో 20 రోజులు సుహాస్, 18 రోజులు కీర్తి సురేష్ షూట్ లో పాల్గొన్నామన్నారు. ఇంత తక్కువ టైమ్ లో షూట్ అయిపోతుందని అస్సలు అనుకోలేదని వివరించారు. మూవీ కథ పల్లెటూరి ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందన్నారు. కాకపోతే కొత్త రకమైన కథతో వస్తున్నామని.. ఇందులో కామెడీ, ఎమోషన్స్ మెయిన్ గా ఉంటాయన్నారు. కీర్తి సురేష్ తనకు ఈ సినిమా చాలా ఎంజాయ్ మెంట్ గా అనిపించిందన్నారు. తాను తక్కువ టైమ్ షూట్ చేసినా సుహాస్ మంచి ఫ్రెండ్ అయిపోయాడన్నారు.
Read Also : Kannappa : కన్నప్ప రెండోరోజు కలెక్షన్లు ఎంతంటే..?