ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ చౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక కాంగ్రెస్ నాయకుడిపై బీజేపీ యువజన విభాగం నాయకుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకుడు కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని సంభాల్ ఏఎస్పీ శ్రీష్ చంద్ర తెలిపారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా అందడంతో త్వరలో చర్యలు తీసుకుంటామని ఆచప తెలిపారు.
Also Read : Steroids selling: జిమ్‌కు వెళ్లే యువకులే టార్గెట్.. స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ సంస్థను 21వ శతాబ్దపు కౌరవులుగా అభివర్ణించినందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త హరిద్వార్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆర్ఎస్ఎస్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు తన క్లయింట్ ఐసీసీ 499,500 సెక్షన్ల కింద కోర్టులో ఫిర్యాదు చేశారని ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా తరపు న్యాయవాది తెలిపారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.
Also Read : malladi vishnu: మంత్రివర్గ విస్తరణ నిర్ణయం ఆయనకు మాత్రమే తెలుసు…
ఈ ఏడాది జనవరి 9న హరియాణాలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత 21వ శతాబ్దానికి చెందిన కౌరవులు ఖాకీ హాఫ్ ప్యాంటు ధరించి శాఖలు నడుపుతున్నారని ఆరోపించారు. వీరితో పాటు దేశంలోని ఇద్దరు ముగ్గురు ధనవంతులు ఉన్నారు అని అన్నారు. ఇదిలా ఉండగా.. మోడీ ఇంటి పేరు ప్రస్తావనకు సంబంధించిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహల్ గాంధీని దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే ఆయనను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించారు. ఇది జరిగిన తర్వాత రాహుల్ గాంధీపై రెండవ పరువు నష్టం కేసు కూడా నమోదైంది.