ఫెర్టిఫైడ్ బియ్యం వల్ల పోషక విలువలు అందుతాయని,దీనిపై ఎలాంటి అపోహలు చెందొద్దని భారత ఆహార సంస్థ తెలంగాణ ప్రాంతీయ శాఖ జెనరాల్ మేనేజర్ జి.ఎన్. రాజు చెప్పారు.ఐరెన్ సహా ఇతర పోషకాల లోటు వల్ల సహజ ఎదుగుదల ఉండడం లేదని అందుకే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం తో కలిపి వీటి సరఫరా చేస్తామన్నారు.హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన భారత ఆహార సంస్థ విజయ పురోగతిని వివరించారు.వంద కిలోల బియ్యంలో కిలో ఫెర్టిఫైడ్ బియ్యం కలుపుతామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తీసుజున్న ఈ నిర్ణయం వల్ల పేద,మధ్య తరగతి ప్రజల్లో పూర్తి పోషకాలు అందే ఆహారం లభిస్తుందని అన్నారు.పిల్లలు,మహిళల్లో ఎనిమియా లాంటి వ్యాధులు ఉన్నాయని ఐరన్ శరీరానికి అందకపోవడం వల్లనే సరైన ఎదుగుదల, రోగనిరోధక శక్తి ఉండటం లేదన్నారు.
Also Read : Minister KTR : లబ్ధిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు
కాగా భారత ఆహార సంస్థ తెలంగాణ ప్రాంతీయ శాఖ బియ్యం సేకరణ లో గణనీయ అభివృద్ధి సాధించిందని చెప్పారు.తొలుత రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరణ చేస్తుందని,తర్వాత మిల్లర్ల నుంచి భారత ఆహార సంస్థ ధాన్యాన్ని సేకరిస్తుందని అన్నారు.దీనిని అవసరమైన ప్రాంతాలకు తరలిస్తామని చెప్పిన ఆయన ముందుగా సనత్ నగర్ లోని ఎఫ్.సి.ఐ గోధముల్లో నివ చేస్తానని అన్నారు. కాగా భారత ఆహార సమంత తెలంగాణా డివిజనల్ మేనేజర్ అభయ్ రామారావు మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం 6400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్.సి.ఐ సేకరించిందని చెప్పారు.దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ధాన్యాన్ని సేకరిస్తూ రైతులకు తోడ్పాటు ను అందిస్తున్నామనన్నారు.ధాన్యం సేకరణలో అన్ని రకాల పారమీటర్లు పటిస్తున్నామన్నారు.
Also Read : Gold smuggling: జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత