CII Summit Partnership Visakhapatnam: విశాఖపట్నం నగరం ప్రస్తుతం హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా చర్యలను చేపట్టారు. దేశ, విదేశాల నుండి పరిశ్రమలు, ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్న ఈ సదస్సు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సదస్సు సందర్భంగా నగర భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం మొత్తం 2,200 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. వీరిలో సీఐలు, ఎస్సైలు, కాంటిస్టేబుళ్లు, ట్రాఫిక్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సదస్సు ప్రధాన వేదికలైన ఆంధ్రా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు పూర్తిగా ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉండనున్నాయి.
Vijayawada Crime: భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త.. రోడ్డుపై కత్తితో వీరంగం సృష్టించిన భర్త..!
భద్రతా ఏర్పాట్లను డీజీపీ స్వయంగా సీనియర్ అధికారులతో సమీక్షించారు. ఏవైనా అవాంఛిత ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిఘా కోసం 15 డ్రోన్లు, 155 సీసీ కెమెరాలు నగరంలోని కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ నిరంతరంగా పర్యవేక్షణ చేయనున్నాయి. సదస్సు సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక పథకాన్ని సిద్ధం చేశారు. వాహనాల కదలికలను ‘అస్త్రం’ యాప్ ద్వారా రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నారు. రూట్ మ్యాప్‌లు, డైవర్షన్‌లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో విశాఖలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. సీఐఐ సదస్సు కారణంగా ప్రత్యేక నిఘా బృందాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు మోహరించాయి. ప్రతి వేదిక, హోటల్, వీఐపీ మార్గాల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు జరుగుతున్నాయి.
Vijay Devarakonda : వీలైనంత ఎంజాయ్ చేయండి.. విజయ్ కామెంట్స్ కు అర్థమేంటో