CII Partnership Summit 2025: విశాఖ వేదికగా జరుగుతున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సును ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు రోజుల పాటు జరిగే ఈసదస్సు కోసం విశాఖ సాగర తీరం ముస్తాబు అయింది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3 వేల…
CII Summit Partnership Visakhapatnam: విశాఖపట్నం నగరం ప్రస్తుతం హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా చర్యలను చేపట్టారు. దేశ, విదేశాల నుండి పరిశ్రమలు, ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్న ఈ సదస్సు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సదస్సు సందర్భంగా నగర భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం మొత్తం 2,200 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. వీరిలో సీఐలు, ఎస్సైలు, కాంటిస్టేబుళ్లు, ట్రాఫిక్…
Investments in Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడుల జోరు మళ్లీ మొదలుకానుంది. రాబోయే సిఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2025లో రూ. 50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇప్పటికే ఒప్పందాలు (MOU)లు కుదిరినట్లు సిఆర్డిఎ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఈ సమ్మిట్ విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరగనుంది. ఈ పెట్టుబడులు ప్రధానంగా పర్యాటకం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక వసతులు వంటి విభాగాల్లో రానున్నాయి. అమరావతిని సుస్థిర నగర అభివృద్ధి కేంద్రంగా, అంతర్జాతీయ భాగస్వామ్యాల హబ్‌గా…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా యూఏఈ పర్యటనను ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు బృందం నేటి (22వ తేదీ) నుంచి యూఏఈలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘భాగస్వామ్య సదస్సు’కు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ…