Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఏ స్టేజ్ ఎక్కినా సరే ఏదో ఒక కామెంట్ చేసి అటెన్షన్ లోకి వచ్చేస్తాడు. అది ఆయన స్పెషాలిటీ కాబోలు. ఇక తాజాగా తన రూమర్డ్ ప్రియురాలి రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ మంచి మంచి హిట్ అయింది. దీంతో మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూశాక తన మనసు మారిపోయిందని తెలిపాడు. లైఫ్ లో చావు, పుట్టుక మన చేతుల్లో ఉండవని.. కాబట్టి వీలైనంత ఎంజాయ్ చేయాలంటూ తెలిపాడు విజయ్.
Read Also : RakulPreet Singh : బాబోయ్.. బికినీలో మొత్తం చూపించేసిన రకుల్ ప్రీత్
చావు ఎప్పుడు వస్తే అప్పుడు పోవాల్సిందే కాబట్టి.. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలన్నాడు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ విజయ్ దేవరకొండ చెప్పింది.. ఎంజాయ్ మెంట్ గురించేనా అంటున్నారు. ప్రస్తుతం విజయ్, రష్మిక డేటింగ్ లో ఉన్నారని అందరికీ తెలిసిందే. పైగా రీసెంట్ గానే వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలా రష్మికతో వీలు కుదిరినప్పుడల్లా ఫారిన్ టూర్స్ వేస్తున్నాడు విజయ్ దేవరకొండ. కానీ ఆ విషయం బయటకు తెలియనివ్వట్లేదు. విజయ్ చెప్పింది బహుషా అలాంటి ఎంజాయ్ మెంట్ గురించే కావచ్చు.
Read Also : SSMB 29 : చడీచప్పుడు లేకుండా పోస్టర్లు.. రాజమౌళి ఏం చేస్తున్నావ్..?