కోట్లు కొల్లగొట్టడంలో ఆరితేరారు… లేనిది ఉన్నట్లు… ఉన్నది లేనట్టు మాయామశ్చింద్రా చేయడంలో ఘనులు. ఇలాంటోళ్లకు తప్పించుకుని పారిపోవడం ఓ లెక్కా. హెచ్‌సీఏ స్కాంలో సీఐడీకి చిక్కకుండా పారిపోయిన దేవరాజు చుక్కలు చూపించాడు. రోజుకో రాష్ట్రంలో పూటకో ఊరిలో తలదాచుకుంటూ… మారు వేషాల్లో తిరిగాడు. ముప్పుతిప్పలు పెట్టి.. చివరకు పూణెలో అడ్డంగా దొరికిపోయాడు. దేవరాజును కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
Also Read:Off The Record: రామ్మోహన్ నాయుడు మాటలన్నీ పైపై డబులేనా..?
హెచ్‌సీఏ సెక్రెటరీ దేవరాజు.. హెచ్‌సీఏ స్కాంలో A2 గా ఉన్న నిందితుడు. హెచ్‌సీఏ కేసులో కొన్ని రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. ముప్పుతిప్పలు పెట్టిన దేవరాజును ఎట్టకేలకు పూణెలో పట్టుకున్నారు సీఐడీ అధికారులు. కేసు నమోదు చేసిన రోజు నుంచి.. 17 రోజులపాటు రోజుకో ప్రాంతంలో తలదాచుకున్నాడు దేవరాజు.
Also Read:Paracetamol Side Effects: వర్షాకాలంలో పారాసిటమాల్‌కు మంచి గిరాకీ.. దీని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా..?
హెచ్‌సీఏ కేసులో A1 గా ఉన్న జగన్మోహన్రావు, ఏ3 గా ఉన్న శ్రీనివాసరావు, ఏ4 సునీల్ కాంటే, ఏ5 రాజేందర్‌యాదవ్, ఏ6 కవిత ను అరెస్ట్ చేసింది సీఐడీ. కానీ.. A2 గా ఉన్న హెచ్‌సీఏ సెక్రెటరీ దేవరాజు మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా మాయం అయ్యాడు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలించినా సీఐడీ పోలీసులకు దొరకలేదు దేవరాజు. సీరియస్‌గా తీసుకున్న సీఐడీ.. దేవరాజు కోసం ప్రత్యేక బృందాలతో గాలించింది. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డి ఇచ్చిన లీక్ తోనే దేవరాజు పరార్ అయినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. దేవరాజును అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి… వెంటనే దేవరాజును అలర్ట్ చేశాడు. దీంతో దేవరాజు పరార్ అయ్యాడు.
Also Read:Bananas: అరటి పండు మంచిదే.. కానీ ఇలా తింటే చాలా ప్రమాదం..!
ఇతర రాష్ట్రాల్లో దేవరాజు తలదాచుకున్నాడని సమాచారం తెలుసుకున్న సీఐడీ.. 6 ప్రత్యేక బృందాలతో గాలించింది. 17 రోజులపాటు పరారీలో ఉన్న దేవరాజు.. భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగుళూరు, గోవా, ఊటీ, యానాం.. తిరుగుతూ పూణె చేరుకున్నాడు. అప్పటికే పక్కా సమాచారం అందుకున్న సీఐడీ.. దేవరాజును పూణెలో అదుపులోకి తీసుకుంది. మొత్తంగా 17 రోజులపాటు 7 రాష్ట్రాల్లో తలదాచుకున్నాడు దేవరాజు.
Also Read:Paracetamol Side Effects: వర్షాకాలంలో పారాసిటమాల్‌కు మంచి గిరాకీ.. దీని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా..?
పూణె నుంచి దేవరాజును హైదరాబాద్ తీసుకొచ్చిన సీఐడీ అధికారులు… మల్కాజిగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దేవరాజుకు హైదరాబాద్ లోని 10 డౌన్ పబ్ ఓనర్ షెల్టర్ ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు. అన్ని రాష్ట్రాల్లో దేవరాజు తలదాచుకునేందుకు 5 స్టార్ హోటల్స్ సదుపాయం కూడా ఇతడే కల్పించాడు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లేందుకు వెహికిల్స్‌ను కూడా మార్చాడు దేవరాజు. ఈ వెహికిల్స్‌ను కూడా ఇతడే కల్పించాడు.
Also Read:Paracetamol Side Effects: వర్షాకాలంలో పారాసిటమాల్‌కు మంచి గిరాకీ.. దీని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా..?
దేవరాజు కోసం గాలిస్తున్న సీఐడీ అధికారులు.. పలు రాష్ట్రాల పోలీసులు, చెక్‌పోస్ట్‌లు, ఇంటలెజిన్స్ టీమ్స్ తో సమన్వయం చేసుకున్నారు. చివరకు దేవరాజు పూణెలో ఉన్నట్లు గుర్తించినా… 36 గంటలపాటు లైవ్ ట్రాకింగ్ చేశాయి సీఐడీ టీమ్స్. పూణె నుంచి మరో ప్రాంతానికి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నారు సీఐడీ అధికారులు.
Also Read:Devaraj Arrested: హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్..
కేసులో కీలకంగా ఉన్న దేవరాజు అరెస్ట్‌తో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్ట్టై… సీఐడీ కస్టడీని ఎదుర్కున్న నిందితులు కూడా దేవరాజు పేరును ప్రస్తావించారు. దీంతో.. దేవరాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగుచూడనున్నాయి. మరికొన్ని అరెస్ట్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే దేవరాజు కు షెల్టర్ ఇచ్చిన పబ్ ఓనర్ కోసం కూడా గాలిస్తున్నారు పోలీసులు.