ఫిర్యాదు చేసేందుకు వస్తే.. పోలీసులు నిరాకరించారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయి తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో.. మనస్తాపం చెందిన ఆ మహిళ కొడుకు ప్రభుత్వ వాహనానికి నిప్పుపెట్టాడు. నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తించారు.