RRR Re-Release : మరోసారి థియేటర్స్ కు వస్తున్న గ్లోబల్ బ్లాక్ బస్టర్.. రీ రిలీజ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ “ఆర్ఆర్ఆర్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించగా మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు.ఈ సినిమాను దానయ్య డివివి గ్రాండ్ గా నిర్మించారు.టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడం అలాగే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.2022 మార్చి 25న రిలీజైన ఈ ఎపిక్ పీరియాడిక్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. ఈ సినిమాతో రామ్‍చరణ్, ఎన్టీఆర్ ఏకంగా గ్లోబల్ స్టార్స్ గా మారారు. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‍బర్గ్ వంటి చాలా మంది ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది.మే 10వ తేదీన ఈ బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం రీ రిలీజ్ కానుంది.ఆర్ఆర్ఆర్ సినిమా 2డీ మరియు 3డీ ఫార్మాట్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్‍గా , అల్లూరి సీతారామరాజుగా రామ్‍చరణ్ అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ చిత్రాన్ని రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారు.ఈమూవీలో రాజమౌళి మార్క్ యాక్షన్, ఎలివేషన్ సీన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో దుమ్మురేపిన ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.1,387 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.అలాగే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ ఆర్ఆర్ఆర్ మూవీ సత్తా చాటింది.ఈ మూవీలోని నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ,అలాగే లిరిక్ రైటర్ చంద్రబోస్ కు ఆస్కార్ అవార్డు లభించింది .
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!