ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడి నేటితో ముగియడంతో ఆయనను ఈడీ అధికారులు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. ఇక, కోర్టు కేజ్రీవాల్ కు జుడిషీయల్ రిమాండ్ విధించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ (సోమవారం) ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆప్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్, ఈడీ విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
మనీలాండరింగ్ కేసులో బుధవారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరో 5 రోజులు పొడిగించింది.