పాకిస్థాన్ యువతికి.. భారత్‌లో పునరుజ్జీవనం అనుగ్రహింపబడింది. గుండె సమస్యతో బాధపడుతున్న ఆ యువతికి అదృష్టం కొలది ఢిల్లీకి చెందిన వ్యక్తి గుండె దొరకడంతో ఆమెకు తక్షణమే మార్పిడి చేసి కొత్త జీవితాన్ని చెన్నై వైద్యులు అనుగ్రహించారు. దీంతో ఆమె, కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డకు మరో జీవితాన్ని అనుగ్రహించిన వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన 19 ఏళ్ల అయేషా రాషన్ గుండె సమస్యతో బాధపడుతోంది. ఆమె ఫ్యాషన్ డిజైన్‌ను చదువుకొనేందుకు సిద్ధపడుతోంది. యువతి తీవ్రమైన గుండె సమస్యతో ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. కానీ వైద్యం చేయించుకునేంత స్థోమత లేదు. దీంతో ఆమెకు నగరానికి చెందిన ఐశ్వర్యన్ ట్రస్ట్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అంతే చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌లో విజయవంతంగా వైద్యులు గుండె మార్పిడి చేశారు. ఆమె ఇప్పుడు కోలుకుని సంతోషంగా ఉంది. దీంతో కుటుంబ సభ్యులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులకు, ట్రస్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Liquor Sales: ఎన్నికల వేళ ఏరులై పారుతోన్న మద్యం.. అమాంతం పెరిగిన సేల్స్
శస్త్ర చికిత్స తర్వాత తాను ఆరోగ్యంగా ఉన్నట్లు యువతి రాషన్ తెలిపింది. ఆరోగ్యం నిలకడగా ఉందని.. పాకిస్థాన్‌కు తిరిగి వెళ్తానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆస్పత్రి వారికి, ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపింది. వాస్తవానికి అయేషా రాషన్ పుట్టింది ఇండియాలోనే. కానీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో నివాసం ఉంటున్నారు.
రాషన్ తీవ్రమైన గుండె సమస్యతో ఆస్పత్రిలో అడ్మిట్ అయిందని డాక్టర్లు తెలిపారు. గుండె వైఫల్యం తర్వాత ఆమె ECMOలో ఉంచినట్లు తెలిపారు. గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు బాగోలేనప్పుడు ఇలా చేస్తామని పేర్కొన్నారు. ఆమె గుండె మార్పిడికి రూ.35లక్షలు ఖర్చు అవుతుంది. కానీ వారి దగ్గర అంత స్థోమత లేక ట్రస్టు భరించిందని తెలిపారు. ఢిల్లీ నుంచి ఓ దాత దగ్గర గుండె వచ్చిందని.. వెంటనే ఆ గుండెను యువతికి మార్పిడి చేసినట్లు వెల్లడించారు. యువతి అదృష్టవంతురాలిని డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్, డాక్టర్ సురేష్ రావు తెలిపారు.
ఇది కూడా చదవండి:Konda Sangeetha Reddy: భారీ మెజార్టీతో కె.వి.ఆర్ గెలుపు ఖాయం..