Hyderabad: మలక్ పేట కాల్పుల ఘటనలో ఒకరి మృతి.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ కారణంతోనే!
- మలక్ పేట కాల్పుల ఘటనలో ఒకరి మృతి
- వెలుగులోకి సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మలక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన్ నగర్ పార్క్ వద్ద దారుణం చోటుచేసుకుంది. శాలివాహన నగర్ పార్కు దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు కారులో వచ్చి చందు రాథోడ్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపి పారిపోయారు. చందు రాథోడ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సీపీఐ నాయకుడు చందు రాథోడ్ ఉదయం వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కాపు కాచి హత్య చేశారు ప్రత్యర్థులు. స్నేహితుల తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న చందు రాథోడ్ కంట్లో కారం చల్లారు దుండగులు. వారి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తునున్న చందు రాథోడ్ వెంటాడి వెంబడించి గన్ తో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి స్విఫ్ట్ కార్లో పరారయ్యారు దుండగులు. హత్య సమయంలో 5మంది పాల్గొన్నట్లు ప్రాథమిక అంచనా.
Also Read:Train fraud AP: రైళ్లలో తిరుగుతున్న నకిలీ టీటీఈ పట్టివేత..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
హత్య కి గలా కారణాలు పాతకక్షలు గా ప్రాథమిక అంచనా.. నాగరకర్నూల్ జిల్లా అచంపేటకి చెందిన చందు రాథోడ్ కుటుంబంతో చైతన్యపురిలో నివాసం ఉంటున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లా.. బల్మూరు మండలం నర్సాయిపల్లి స్వస్థలం.. నర్సాయపల్లి లో తల్లిదండ్రులు ఉంటారు..ఇతను 30 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడని తెలిసింది. చందు నాయక్ పై కాల్పులు జరిపి హత్య చేసింది కూడా సిపిఐ నాయకుడే.. సిపిఐ ఎంఎల్ నాయకుడు రాజేష్ కాల్పు జరిపినట్లుగా గుర్తింపు.. ఇద్దరి మధ్య ఉన్న భూ వివాదమే కాల్పులకు దారి తీసింది అంటున్నారు పోలీసులు. కాల్పుల్లో చనిపోయిన చందు నాయక్ కు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!