Software Couple: విడిపోయిన జంటను పుట్టినరోజు ఏకం చేసింది.. పుట్టినరోజు ఏంటి..? జంటను ఏకం చేయడం ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అయితే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన ఓ జంట విడిపోయింది.. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్నపాటి గొడవతో ఆ పంచాయతీ కాస్తా.. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు చేరింది.. ఆ జంటను పోలీస్ స్టేషన్‌కు పిలిచిన చంద్రగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.. సాఫ్ట్‌వేర్ జంటతో పాటు కుటుంబ సభ్యులు పీఎస్‌కు వచ్చారు.. అయితే, యువ దంపతులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో అర్థ రాత్రి 12 గంటలు దాటిపోయింది సమయం.. 12 గంటల దాటడంతో ఆ సాఫ్ట్‌వేర్ జంటలోని భర్త పుట్టిన రోజు కూడా వచ్చేసింది.. దీంతో, భర్తకు భార్య చేత పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పించారు చంద్రగిరి పోలీసులు. సాఫ్ట్‌వేర్ జంటను ఒకటి చేసి బంధువులలో సంతోషాన్ని నింపారు చంద్రగిరి సీఐ ఓబులేసు.. భర్తకు భార్య బర్త్‌డే శుభాకాంక్షలు తెలపడంతో.. రెండు కుటుంబాల్లో నవ్వులు విరిసాయి.. భార్యతో పాటు ఆమె కుటుంబసభ్యులు, బంధువులు.. భర్త తరపు బంధువులు అంతా అక్కడ ఆ యువకుడికి శుభాకాంక్షలు తెలిపారు.. గొడవను ఇలా సర్దిచెప్పినా చంద్రగిరి పోలీసులకు ప్రశంసల కురిపిస్తున్నారు నగర వాసులు.
Read Also: Nirudyoga March: వరంగల్‌లో బీజేపీ ‘‘నిరుద్యోగ మార్చ్’’.. హాజరుకానున్న బండి సంజయ్