డాక్టర్ గురు ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమమైన వైద్య సేవలు అందిస్తున్న కాంటినెంటల్ హాస్పిటల్స్ ప్రయాణంలో ఇప్పుడు మరో అవార్డు చేరింది. ముంబయిలో జరిగిన ఐ డబ్ల్యూ హెచ్ పేషెంట్ ఫస్ట్ సమ్మిట్ అవార్డ్స్ లో భాగంగా.. 2023 సంవత్సరానికిగాను, బెస్ట్ పేషెంట్ సెంట్రిక్ రీజనల్ హాస్పిటల్ గా, కాంటినెంటల్ హాస్పిటల్స్ ఎంపికైంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తోన్న మాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడు పేషెంట్ సెంట్రిక్ గా వర్క్ చేసే మాకు ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్నిచ్చి మమ్ముల్ని ముందుకు తీసుకు వెళ్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మా కాంటినెంటల్ హాస్పిటల్స్ లో సెక్యూరిటీ దగ్గరినుంచి పై స్థాయి వరకు అందరికీ సమానస్థాయి గౌరవం ఉంటుంది. ఇదే మా విజయాలకు దోహదపడుతుంది.
వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ.. అలాగే QAI నియమాలను పాటిస్తూ.. భారతదేశపు ఫస్ట్ లెవల్ 3 గోల్డ్ స్టాండర్ట్ పొందిన మొదటి హాస్పిటల్ మా కాంటినెంటల్ హాస్పిటల్స్ అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అలాగే 50కి పైగా ప్రత్యేకతలు మరియు 100 మందికి పైగా కన్సల్టెంట్స్ తో అన్ని వయసుల వారికి, ఆరోగ్య సేవలు అందిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచింది కాంటినెంటల్ హాస్పిటల్స్. శ్రేష్ఠత, నాణ్యతకుగాను మా ఆసుపత్రి నిబద్ధతకు అనేక అవార్డులు, అక్రిడిటేషన్‌లు మరియు ప్రశంసలు వచ్చాయి. JCI నుండి NABH వరకు, QAI నుండి NABL వరకు – కాంటినెంటల్ హాస్పిటల్స్ ప్రపంచంలోని కొన్ని ప్రముఖ అక్రిడిటేషన్ ప్రమాణాల ద్వారా గుర్తింపు పొందింది.