Chandrababu Naidu: కూటమి ప్రభుత్వానికి వారసత్వ సమస్యలు ఉన్నాయని గత ప్రభుత్వ తప్పిదాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం చిత్తురులో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు కొందరు రాష్ట్రాన్ని పట్టి పీడించారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజల ఆస్తుల మీద ఫొటోలు వేసుకున్నారని గుర్తు చేశారు. దుర్మార్గం చేసింది చాలక నా పాలనే బెటర్ అంటూ మాట్లాడుతున్నారు. గెలాక్సీ గ్రానైటుతో సర్వే రాళ్లు వేశారన్నారు.. దానిపై బొమ్మలు వేసుకున్నారని గుర్తు చేశారు.. రాళ్లపై బొమ్మల కోసం రూ. 700 కోట్లు ఖర్చుపెట్టారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో నల్లచట్టం తెచ్చారన్నారు. భూ వివాదాలు వస్తే స్థానిక కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా చేశారని.. ఇంత ఘోరమైన చట్టం చేసి నాదే చాలా గొప్ప చట్టం అంటూ బుకాయిస్తున్నారని చెప్పారు. 22ఏ పేరుతో వివాదాలు సృష్టించారని.. ఆ వివాదాలు పరిష్కరించే బాధ్యతను ఆయన పెట్టుకున్న గుమాస్తాకు అప్పగించారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేపట్టిన నల్ల చట్టాన్ని రద్దు చేశాం. గత ప్రభుత్వంలో జరిగిన సర్వే తప్పిదాలను సరి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ట్యాంపర్ చేయలేని విధంగా ఆధునిక టెక్నాలజీ వినియోగించి పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. పేదలకు అండగా ఉండేలా వివిధ రకాల కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
READ MORE: Allu Arjun& NTR : సైలెన్స్ వీడాలి.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!
దేశంలోని ఏ రాష్ట్రమూ ఇవ్వనంత స్థాయిలో పెన్షన్ల ద్వారా సంక్షేమం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రతి నెల రూ. 2730 కోట్ల మేర పెన్షన్ల పంపిణీ జరుగుతోందని వెల్లడించారు. తమిళనాడులో రూ. 315 కోట్లు, కర్ణాటకలో రూ.392 కోట్లు పెన్షన్లు నిమిత్తం ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఏ స్థాయిలో పెన్షన్ అంద చేస్తున్నామో ప్రజలు ఆలోచించాలన్నారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు. ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీపం-2.0 పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని తెలిపారు. అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరగాలని సూచించారు. ఆడబిడ్డలకు సరైన ప్రాధాన్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే.. ఆస్తిలో మహిళలకు ఎన్టీఆర్ సమాన హక్కు కల్పించారని గుర్తు చేశారు. తాను 33 శాతం రిజర్వేషన్ ను ఉద్యోగాలు, విద్య రంగంలో అమలు చేశానని చెప్పారు. 33 శాతం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు రాబోతున్నాయని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో మహిళలు పెద్ద ఎత్తున ఎంపీలు, ఎమ్మెల్యేలుగా అవుతారని సీఎం చంద్రబాబు చెప్పారు. “ఇది శుభ పరిణామం. ఈ ఏడాది వర్షం పడకపోయినా కుప్పం జలకళను సంతరించుకుంది.. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంలో అన్ని చెరువులు కృష్ణా జలాలతో నిండి ఉన్నాయి.. త్వరలోనే అన్ని చెరువుల్లోనూ నీళ్లు నింపేలా కార్యాచరణ చేపట్టాం. వర్షపు నీటితో భూగర్భజలాలు పెంచేలా చేద్దాం.. అనంతపురం ఒకప్పుడు ఎడారిగా ఉంది. ఇప్పుడు అక్కడ నీటి సంరక్షణ అద్భుతంగా చేపడుతున్నారు.. హంద్రీ-నీవాతో అనంతకు నీళ్లిచ్చాం. 10 లక్షల చెక్ డ్యాంలు నిర్మించాం.. హంద్రీ-నీవా, గాలేరు-నగరి సహా రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.. దేశంలో రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా మారింది.. ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో హర్టీకల్చర్ సాగు ఉంది. దీనిని రెట్టింపు చేసి 500 లక్షల మెట్రిక్ టన్నుల సాగు సాధిస్తాం.” అని సీఎం ఆశా భావం వ్యక్తం చేశారు.