మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్.. రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని విమర్శించారు. కనీసం మోటార్లకు బిల్లులు చెల్లించలేదని, తట్టమట్టి తీయలేదని మండిపడ్డారు. ఐదేళ్ళలో జగన్ చేయలేని పనిని, మొదటి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాం అని మంత్రి చెప్పారు. కర్నూలులో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష నిర్వహించాడు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు,…
Annadata Sukhibhava: కడప మహానాడులో హామీ ఇచ్చా త్వరలోనే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనుకున్న ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రారంభించాం. 2028 డిసెంబర్ కల్లా ఫేస్ వన్ స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు..
పోలవరం, బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగిందని.. తుపాన్ బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీస్కుంటున్నామని మంత్రి రామానాయుడు అన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకు వచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తామని.. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని స్పష్టం చేశారు.
హంద్రీనీవా దుస్థితికి గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణం అన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమ్మర్ స్టోరేజిని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హంద్రీనీవా దుస్థితికి కారణం వైసీపీ ప్రభుత్వమే అని విమర్శించారు.. 5 శాతం పనులు కూడా పూర్తి చేయకుండానే సంపదను వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొల్లగొట్టుకుందన్నారు..
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్… హంద్రీనీవా ఆయకట్టు విషయంలో ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆయన.. గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలలో కాలువ కింద 20 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని.. కనీసం 50 రోజులు నీటి అవసరం ఉందని తన లేఖ ద్వారా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు… హెచ్ఎల్సీ నుంచి జీబీసీ, ఇంద్రావతి డీప్ కట్ ద్వారా హంద్రీనీవాకి నీటిని మళ్లించే అవకాశం ఉందని… ఈ విధానంలో…