144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
- Lenovo Legion Y70 (2026) గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్
- గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన హైఎండ్ స్మార్ట్‌ఫోన్
- 6.82 అంగుళాల 2K AMOLED LTPO డిస్ప్లే
- IP66, IP68, IP69 రేటింగ్స్‌తో డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
- 50MP Sony LYT-710 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenovo Legion Y70 (2026) Launched: లెనోవో (Lenovo) కొత్త తరం గేమింగ్ స్మార్ట్‌ఫోన్ Legion Y70 (2026)ను లాంచ్ చేసింది. లెనోవో టిఆంక్సి AI ఆల్-ఇన్-వన్ మల్టీ-డివైస్ ఆల్-సినారియో న్యూ ప్రోడక్ట్ సూపర్ నైట్ ఈవెంట్లో ఈ ఫోన్‌ను పరిచయం చేశారు. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, హైఎండ్ గేమింగ్ డిస్ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్ గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా రూపొందించారు.
అదిరిపోయే 2K OLED డిస్ప్లే:
కొత్త Legion Y70లో 6.82 అంగుళాల 2K AMOLED LTPO డిస్ప్లేను అందించారు. ఇది 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో స్క్రీన్ స్మూత్ గేమింగ్ అనుభూతిని ఇస్తుంది. డిస్ప్లే గ్లోబల్ బ్రైట్నెస్ 2100 నిట్స్ కాగా, పీక్ బ్రైట్నెస్ 7000 నిట్స్ వరకు చేరుతుంది. HDR10+, డాల్బీ విజన్, DC డిమ్మింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 510 PPI పిక్సెల్ డెన్సిటీతో విజువల్స్ మరింత క్లారిటీగా కనిపిస్తాయి.
Also Read
స్మార్ట్ ప్రాసెసర్:
ఈ స్మార్ట్‌ఫోన్‌కు Qualcomm Snapdragon 8 Gen 5 3nm ప్రాసెసర్ ను అందించారు. Adreno 829 GPUతో గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరు మరింత వేగంగా ఉంటుంది. ఫోన్ 12GB, 16GB LPDDR5x RAM ఆప్షన్లతో పాటు 256GB నుంచి 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
భారీ బ్యాటరీ:
Lenovo Legion Y70లో 8000mAh “Star Ring” బ్యాటరీని అందించారు. 90W Super Flash Charge సపోర్ట్‌తో ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రకారం ఈ బ్యాటరీ ఏడు సంవత్సరాల వరకు పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో బైపాస్ పవర్ సప్లై ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా గేమింగ్ సమయంలో ఫోన్ నేరుగా ఛార్జర్ నుంచి పవర్ తీసుకుంటుంది. దీంతో బ్యాటరీపై ఒత్తిడి తగ్గి వేడి కూడా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే లెనోవో నాలుగేళ్ల బ్యాటరీ వారంటీని కూడా అందిస్తోంది. ఆ కాలంలో బ్యాటరీ హెల్త్ 80 శాతం కంటే తగ్గితే ఉచితంగా బ్యాటరీ మార్పిడి చేస్తామని కంపెనీ తెలిపింది.
హైఎండ్ కూలింగ్ సిస్టమ్:
గేమింగ్ సమయంలో ఫోన్ వేడి కాకుండా ఉండేందుకు ట్రిపుల్ హీట్ డిసిపేషన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇందులో థర్మల్ జెల్, లిక్విడ్ మెటల్, వెపర్ ఛాంబర్ (VC) కూలింగ్ టెక్నాలజీలు ఉన్నాయి. అలాగే IP66, IP68, IP69 రేటింగ్స్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
కెమెరా ఫీచర్లు:
ఫోన్ వెనుక భాగంలో 50MP Sony LYT-710 ప్రధాన కెమెరా అందించారు. దీనికి OIS సపోర్ట్ ఉంటుంది. దీనికి తోడుగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఇచ్చారు.
Lenovo Legion Y70 (2026) నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌కు ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అధికారిక విక్రయాలు జూన్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి ధరలు ఇలా ఉన్నాయి.
12GB + 256GB – 2599 యువాన్ (రూ. 36,895)
12GB + 512GB – 3199 యువాన్ (రూ. 45,410)
16GB + 512GB – 3599 యువాన్ (రూ. 51,090)
16GB + 1TB – 4399 యువాన్ (రూ. 62,455).
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!