Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ దోశ తింటే చాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Egg Dosa: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఉదయం పూట ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. రోజూ తినే నార్మల్‌గా డైలీ తినే బియ్యం పిండి దోశల కంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో దోశలు చేసుకుంటే అటు బరువు తగ్గడమే కాకుండా, ఇటు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. దానికి కాస్త గుడ్డు కూడా తోడైతే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. ఈరోజు మనం ‘రాగి ఎగ్ దోశ’ను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
రాగి పిండి
దోశ పిండి (మినపపిండి మిశ్రమం)
కోడిగుడ్లు (Eggs)
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు
అల్లం ముక్కలు, జీలకర్ర
కొత్తిమీర, కరివేపాకు
కొద్దిగా ఇంగువ
రుచికి సరిపడా ఉప్పు, నూనె
తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో రాగి పిండి – సాధారణ దోశ పిండిని సరిసమానంగా లేదా తగినంత మోతాదులో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు ఇంగువ వేసి దోశ పిండిలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడెక్కిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న రాగి పిండి మిశ్రమాన్ని దోశలా వేసుకోవాలి.
దోశ కొద్దిగా కాలాక, దానిపై ఒక కోడిగుడ్డును పగలగొట్టి వేసి, దోశ మొత్తం సమానంగా పరుచుకోవాలి. ఆ పైన మళ్లీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లుకుని, చుట్టూ కొద్దిగా నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. అంతే సింపుల్‌గా ఎంతో రుచికరమైన, వేడివేడి హెల్తీ రాగి ఎగ్ దోశ రెడీ అయిపోతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
కోడిగుడ్డు (ఎగ్) – రాగుల కాంబినేషన్ వల్ల శరీరానికి సూపర్ ప్రోటీన్ వస్తుంది. ఇది ఉదయాన్నే కండరాల బలానికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందించడమే కాకుండా, శరీరానికి రోజంతా కావలసిన ఎనర్జీని కూడా ఇస్తుంది. చురుగ్గా పనిచేసే వారికి ఇది పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్‌గా పని చేస్తుంది. ధాన్యాలన్నింటిలోనూ రాగులలోనే అత్యధికంగా కాల్షియం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యల నుంచి ఇది కాపాడుతుంది. ముఖ్యంగా మహిళలకు, ఎదిగే పిల్లలకు ఎముకలు, పళ్లు బలంగా మారడానికి రాగి దోశ ఎంతగానో సహాయపడుతుంది. రాగులలో – కోడిగుడ్డు సొనలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత సమస్యతో బాధపడే వారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
తరచూ నీరసం, అలసటగా అనిపించే వారికి ఇది బెస్ట్ డైట్. రాగులలో ఉండే అమినో యాసిడ్స్ కాలేయంలోని అదనపు కొవ్వును తొలగించడానికి సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది. ఈ దోశలో వాడే రాగులు – జీలకర్ర, అల్లం, ఇంగువ వంటి పదార్థాలు జీర్ణశక్తిని అద్భుతంగా పెంచుతాయి. రాగులలో ఉండే కాంప్లెక్స్ ఫైబర్ కారణంగా తిన్న ఆహారం సులభంగా అరిగి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా జీర్ణవ్యవస్థను క్లీన్‌గా ఉంచుతుంది. రాగులలో ‘మిథియోనైన్’, ‘లైసిన్’ వంటి ముఖ్యమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలు పడకుండా కాపాడటానికి సహాయపడతాయి. అలాగే గుడ్డులో ఉండే విటమిన్స్ జుట్టు రాలడాన్ని తగ్గించి, హెయిర్ గ్రోత్‌కు తోడ్పడతాయి.
తాజావార్తలు
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!