Ram Charan: మా అమ్మ నమ్మలేదు.. నాకు దక్కిన ఈ గౌరవం వారందరిదీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan Speech After Receiving Doctorate: అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్‌ను సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు చెన్నైకు చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి గౌరవంతో డాక్టరేట్ బహుకరించిన వేల్స్ యూనివర్సిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నా. 45వేలకు పైగా స్టూడెంట్స్, 38 సంవత్సరాలకు పైగా ఈ యూనివర్సిటీని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అలాంటి యూనివర్సిటీ నుంచి నాకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారనే విషయం తెలియగానే మా అమ్మ నమ్మలేదు, ఆర్మీలాంటి గ్రాడ్యుయేషన్స్ మధ్యలో నేను ఈరోజు ఇలా ఉండటం ఊహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి నాకు దక్కిన గౌరవం నాది కాదు.. నా అభిమానులది, దర్శకులు, నిర్మాతలు, నా తోటి నటీనటులది.
Lip Lock : లిప్ లాక్ చేసేవారికి షాకింగ్ న్యూస్.. ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి..
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
చెన్నై నాకెంతో ఇచ్చింది, నాకే కాదు, మా నాన్నగారు తన ప్రయాణాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారు. నా సతీమణి ఉపాసన వాళ్లు అపోలో హాస్పిటల్స్‌ను కూడా ఇక్కడ నుంచే మొదలు పెట్టారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనబై శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాలని కలలు కని చెన్నైకి వస్తే అది నేరవేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్పతనం. అన్ని రంగాల వారికి ఈ భూమి కలలను నేరవేర్చేదిగా ఉంటూ వస్తుంది. నేను ఇక్కడ విజయ హాస్పిటల్‌లోనే పుట్టి పెరిగా. సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్‌గారితో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాను. ఆయనతో వర్క్ చేయాలని చాలా మంది అనుకుంటారు. నేను ఇప్పుడు ఆయనతో వర్క్ చేయటం మంచి ఎక్స్‌పీరియెన్స్. శంకర్‌గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. డిఫరెంట్ స్టోరీతో ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాం అని అన్నారు
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!