మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మళ్ళీ ఆవేశానికి లోనయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. పుంగనూరు పుడంగి పెద్దిరెడ్డి గుర్తు పెట్టుకోవాలి. పుంగనూరులో నీ కథ తేలుస్తా. ….ఇది బిగినింగ్ మాత్రమే. నువ్వూ ఒక సైకోలా మారావు. ….14 ఏళ్లు నేను అనుకుని ఉంటే ఈ జిల్లాలో తిరిగి ఉండే వాడివా? నీఇష్ట ప్రకారం అరాచకాలు చేస్తావా. …..నీ డెయిరీకి మాత్రమే పాలు పోయాలా? …నీ తాత జాగీరా ఖబడ్డార్, నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది. కుప్పం పంచాయితీ ఎన్నికలు కాదు. ఇప్పుడు రా నీ సంగతెంటో కుప్పంలో చూస్తాను అన్నారు చంద్రబాబునాయుడు.
కుప్పంలో బట్టలు ఇప్పిస్తా….మైనింగ్, ఇసుకకు కప్పం కట్టాలా? కుప్పంలో ఫైన్ లు వేసి రూ. 50 కోట్లు కప్పం ముందుగా ఫైన్ లు వేయడం మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తావా? ఇప్పటిదాకా రాజకీయమే చూశాను, ఇప్పుడు రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులతో పోరాటం చేస్తున్నా అన్నారు. కరడు గట్టిన నేరస్తుడిలా మారిపోయారు. నేను ఎవ్వరిని వదిలిపెట్టను అన్నారు చంద్రబాబునాయుడు. ఏపీలో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు సభల్లో అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బహిరంగసభలకు, సమావేశాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
Read Also: Air India: మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు..