Vikas Raj: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు రంగంలోకి దిగి నాగార్జునసాగర్ డ్యాం వద్ద నీటి పంపకం కోసం ముళ్ల కంచె వేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పందించారు. ఆ విషయాన్ని పోలీసులే చూసుకుంటారని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. నిబంధనలను ఎవరూ అతిక్రమించవద్దని హెచ్చరించారు.