Road Accident: క్యాన్సర్‌తో బాధపడుతున్న కొడుకును బతికించుకోడానికి ఊరు కాని ఊరు వెళ్లాడు ఓ తండ్రి.. కానీ, రోడ్డు ప్రమాదంలో.. అది కూడా తండ్రి కళ్ల ఎదుటే.. ఆ కొడుకు కన్నుమూయడంతో ఆయన బాధను వర్ణించడం సాధ్యం కావడం లేదు.. క్యాన్సర్‌నుంచి కొడుకుని రక్షించుకోడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగిన ఆ తండ్రి ఆవేదనను ఆ దేవుడు కూడా ఆలకించలేదు. రోడ్డు ప్రమాదరూపంలో కళ్ల ముందే కొడుకును మరణించడంతో ఆ తండ్రి వేదన చెప్పనలవి కాకుండా ఉంది. Read…
Lunar Eclipse: సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి ఒక సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ గ్రహణం శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలలో.. కుంభరాశిలో జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహణం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుందని పండితులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ 7న సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:37 గంటలకు ప్రారంభమై, 11:41 గంటలకు మధ్యస్థితిని చేరుకుని, సెప్టెంబర్ 8న అర్ధరాత్రి 1:31 గంటలకు ముగియనుంది. ఈ గ్రహణం కుంభరాశిలో జరగనుండటంతో కొన్ని రాశుల…
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కేంద్రంలో ఉన్న గాంధీనగర్ కు చెందిన ఎం.నాగజ్యోతి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహంచిన మెగా డీఎస్సీలో మంచి మార్కులు సాధించింది.. 74.40 మార్కులు రాబట్టింది.. మంచి మార్కులతో టీచర్ ఉద్యోగానికి అర్హురాలు అయినప్పటికీ.. క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె.. విశాఖలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని, ఆ క్యాన్సర్ కణాలు ఇప్పుడు అతని ఎముకలకు వ్యాపించాయని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 82 ఏళ్ల బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు బైడెన్ కు ఏయే చికిత్సలు అందించాలో పరిశీలిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్‌గా కనిపిస్తుంది.…
Payal Rajput : ఈ నడుమ సెలబ్రిటీల ఇళ్లలో క్యాన్సర్ అనే వార్త తరచూ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా స్టార్ హీరోయిన్ తండ్రిని కూడా క్యాన్సర్ సోకింది. తాజాగా పాయల్ రాజ్ పుత్ తన తండ్రికి క్యాన్సర్ సోకినట్టు తెలిపింది. మంగళవారం సినిమాతో పాయల్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. బోల్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ భామ.. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. అయితే తాజాగా తన తండ్రికి జీర్ణాశయ క్యాన్సర్…
బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై అధికార యంత్రాంగం ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని అన్నారు. గ్రామంలో 1,295 మందిని పరీక్ష చేస్తే 62 క్యాన్సర్ కేసులు వచ్చాయని తెలిపారు. సాధారణ కంటే మూడు రేట్లు అధికంగా బిక్కవోలు గ్రామంలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. జాతీయ క్యాన్సర్ కేసు యావరేజ్ కంటే ఇది ఆరు రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు. Also Read:Ponguru Narayana: 30 వేల…
గతకొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని బలభద్రపురం గ్రామం హాట్ టాపిక్ గా మారింది. పదుల సంఖ్యంలో అక్కడి ప్రజలు క్యాన్సర్ భారిన పడడంతో తీవ్రకలకలం రేగింది. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తూ వైద్య సేవలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది. తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కొంత కాలంగా జరుతున్నాయన్నారు. ఇప్పటికే నాలుగు లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష లు నిర్వహించామని తెలిపారు.…
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో రెండవ రోజు ఇంటింటి సర్వే కొనసాగనుంది. వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
ఒకే గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు ఇప్పుడు జలభద్రపురాన్ని వణికిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు కలకలం సృష్టిస్తున్నారు.. గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
మహిళల్లో క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మహిళలను వేధిస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ అన్నారు. తొమ్మిది నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు అందిస్తామన్నారు.