సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతేకు దగ్గరలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఓ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొనడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఊరుకొండ మండలానికి చెందిన బాల స్వామి గౌడ్, శివయ్య, యాదయ్య గౌడ్, అంజమ్మ, అనిత, తేజ ఇంద్రకల్ నుంచి దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో వివాహానికి హాజరై తిరిగి తమ గ్రామానికి వెళ్తున్నారు. హైదరాబాద్‌కు…