Bunny Vasu: తాజాగా హైదరాబాద్ లో జరిగిన లిట్టిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ కు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇందుగులో ముఖ్యంగా బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ, బన్నీ వాసు, అల్లు అరవింద్ ఇలా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బన్నీ వాసు పిలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ఇండస్ట్రీలో ఇంత బాగున్నామంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ అని అన్నారు. వీళ్ళద్దరే.. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కాదు, మేము వాళ్ళ రిలేషన్స్ కాదు.. ఏమి కాదు జస్ట్ టాలెంట్ ఉన్న నలుగురు కుర్రోళ్ళని 20ఏళ్ల అప్పుడు ఆయన తీసుకున్నాడు.
Asia Cup 2025: సూపర్-4 జట్లు ఖరారు.. భారత్, పాకిస్థాన్ మధ్య మరోసారి సంగ్రామం!
ఆలా ఆయన తీసుకొని ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ నుంచోవడానికి కారకుడని ఆయన అన్నారు. అయితే, ఈ కార్యక్రంలో బండ్ల గణేష్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అల్లు అరవింద్ స్టార్ కమెడియన్ కి బిడ్డ కింద పుట్టలేదు.. ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగయ్య స్టార్ కామెడియన్ అయ్యారు. అది బండ్ల అన్నకి తెలియదేమో ఆ విషయం అంటూ మాట్లాడాడు. తనలాంటి వారికి ఎంతో ఇన్స్పిరేషన్ అని అరవింద్ ను ఉందేశించి మాట్లాడారు. అలాగే ప్రస్తుతం ఇక ఇక్కడ లేకపోయినా.. ఎప్పుడు నాతో ఉండే మనిషి బన్నీ అని అన్నాడు.
Sangareddy: గంజాయి మత్తులో ఖైదీల వీరంగం.. భయాందోళనలో జైలు సిబ్బంది