Realme GT5 Pro 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్‌మీ’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ‘రియల్‌మీ జీటీ 5 ప్రో’ పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే రిలీజ్ చేయనుంది. నవంబర్ చివరలో భారత మార్కెట్‌లోకి ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర దాదాపుగా రూ. 60 వేలు ఉండే అవకాశం ఉంది. రియల్‌మీ జీటీ 5 ప్రో బ్యాటరీ, కెమెరా వివరాలను ఓసారి చూద్దాం.
Realme GT5 Pro Specs:
రియల్‌మీ జీటీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్‌లో లాంచ్ కానుంది. 12 జీబీ ర్యామ్ + 256 స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, 1264×780 పిక్సెల్స్ ఈ ఫోన్‌లో అందించనున్నారు. క్వాల్‌కామ్ ఏబీ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 (4 nm), ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు.
Realme GT5 Pro Camera and Battery:
రియల్‌మీ జీటీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా ఉంటుంది.100 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడిన 5400 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌కు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియరానున్నాయి.