Cyber Crime: ఐటీ ఉద్యోగిని మోసం చేసిన నేరగాళ్లు.. రూ.71.82 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: దేశంలో సైబర్ క్రైమ్ మోసాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ మోసాల గురించి నిత్యం ప్రజలను హెచ్చరించినా.. ప్రతీ రోజు అలాంటి వాటికి బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ గురించి హెచ్చరిస్తుంటే.. మోసగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. బహుళజాతి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 35 ఏళ్ల మహిళ సైబర్ మోసానికి గురై రూ.71.82 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన సెప్టెంబర్ 2 నుంచి 15వ తేదీ మధ్య జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Also Read: Petrol-Diesel Sales: తగ్గిన డీజిల్ వినియోగం..పెరిగిన పెట్రోల్!
Also Read
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
హింజేవాడిలోని కోహిన్నోర్ కోరెల్‌కు చెందిన బాధితురాలు అమ్రపాలి చంద్రశేఖర్ కులతే అనే ఐటీ ఉద్యోగిని ఆన్‌లైన్‌లో టాస్క్ పేరుతో సంప్రదించి మోసం చేశారు. ప్రారంభంలో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సందేశాన్ని అందుకుంది. దీనిలో ఒక మోసగాడు రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన రివ్యూలను రాయమని అడిగాడు. ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. టాస్క్ పూర్తయిన తర్వాత ఆమె చెల్లింపు కోసం అడుగుతున్నప్పుడు మంచి రాబడిని సంపాదించడానికి ‘కాయిన్ స్విచ్’ ప్లాట్‌ఫారమ్‌లో సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టమని నిందితుడు ఆమెను ఒప్పించాడు.
Also Read: Pak Miss Universe: వివాదాల్లో మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ఎరికా రాబిన్.. ప్రభుత్వం విచారణకు ఆదేశం
వారిని నమ్మి, బాధితురాలు సైబర్ నేరగాళ్లతో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. వారు ఆమెను పూర్తిగా నమ్మించారు. రెండు వారాల్లో మోసగాళ్లు అందించిన వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తూ, మొత్తం 21 లావాదేవీలు చేసింది. అనంతరం తన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడగడంతో వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆమె మోసపోయినట్లు గ్రహించింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. మొత్తం ఆమె రూ. 71.82 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. హింజేవాడి పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?