వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో నూటికి నూరు శాతం గెలిచి మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీఆర్ఎస్ పార్టీయేనని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అన్ని గమనించాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే రాష్ట్రం అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంని ఆయన తెలిపారు. 2014 నుంచి జరిగిన అభివృద్ధి పనులను, పరిపాలనను, సంక్షేమ పథకాల అమలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతోందని.. ప్రతిపక్షాలు ఓర్వలేకే అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Tejashwi Yadav: ‘గుజరాతీలు దుండగులు’ అనే వ్యాఖ్యపై తేజస్వి యాదవ్‌కు కోర్టు సమన్లు
బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లలో చేసింది ఏమీలేదు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇటు సిలిండర్ రేట్లు, పెట్రోల్, నోట్ల రద్దుతో ప్రజలను కష్టాల పాలు చేసింది అని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, స్మశానవాటికలు, ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతీ ఇంటికి అందని పథకం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎంత మంది అర్హులో అందరికి పెన్షన్ ఇవ్వమన్నారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.
Read Also: Naga Chaitanya: సమంతను చూసి.. థియేటర్ లో నుంచి బయటకొచ్చేసిన చై.. ?
తెలంగాణలో అత్యధికంగా 48 లక్షల మందికి పెన్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అవసరం కోసం మాట్లాడే నాయకుల మాటలు నమ్మవద్దు.. దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నారు.. ఒక్కొక్క గ్రామానికి పల్లె ప్రగతిలో భాగంగా 1లక్ష 40 వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం.. మీకు కావాలి అంబానీ, ఆదానీలు కావాలి.. మాకు ప్రజలు కావాలి అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.