వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో నూటికి నూరు శాతం గెలిచి మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీఆర్ఎస్ పార్టీయేనని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని ఆయన పేర్కొన్నారు.
గురుకుల పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పలు గరుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కరోనా అనం తరం ప్రారంభమైనా పాఠశాలల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గౌలిదొడ్డిలోని సోషల్ వేల్ఫేర్ గురుకుల బాలికల, బాలుర పాఠశాలలను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలోని తర గతి గదులు, హాస్టల్ భవనం, మెస్‌హాల్‌ను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.…