భారత రాష్ట్ర సమితి రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఫిర్యాదుతో ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోపు సమాధానం చెప్పాలని రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు.
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు.. ఇలా అసత్య ప్రచారం చేయడం పద్దతి కాదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు అవగాహనా ఉందా.. కేసీఆర్ ను రైతు హంతకుడు అని అనడానికి నోరు ఎలా వచ్చింది.
CM KCR: ఈ రోజు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పొరేషన్స్ ఛైర్మన్లకు పిలుపు అందింది.. ఈ సమావేశంలో జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు…
కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల కంటే ముందే కేంద్రం చర్చకు రావాలని బీఆర్‌ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ లోక్‌సభాపక్ష నేత, బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని బీఆర్‌ఎస్ ఎంపీలు అన్నారు. స్పీకర్ పోడియంను BRS ఎంపీలు చుట్టుముట్టారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.