Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే.. ఇకనుంచి బాలీవుడ్ సినిమాలలో నటించకూడదని నిర్ణయించుకున్నాడట. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో ఆదిపురుష్ లాంటి భారీ బడ్జెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వం వహించడం, రాముడిగా ప్రభాస్ కనిపించడం, భారీ బడ్జెట్ ఫిల్మ్ అని చెప్పడంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ అంటే ఆ మాత్రం ఉండాలి అని చెప్పుకొచ్చారు అభిమానులు. ఇక ఏ ముహూర్తాన ఆదిపురుష్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి సినిమా రిలీజ్ అయ్యేవరకు కూడా వివాదాలు.. వివాదాలు అంటూ తిరుగుతూనే ఉంది. పోనీ వివాదాల వలన ఎంత పేరు వచ్చినా సినిమా ఏమైనా హిట్ అందుకుందా అంటే అది లేదు.
Tiger Nageswara Rao: ఈ గజదొంగను ఆపుతున్న శక్తులు ఎవరు.. అదికూడా చెప్పండి బ్రో
మిక్స్డ్ టాక్ అందుకొని ఇక్కడ కూడా వివాదాల బాటనే పట్టింది. అస్సలు రామాయణం ఇలా ఉంటుందా.. ? అని అడిగితే.. మేము తీసిన రామాయణం వేరు.. అది ఇలాగే ఉంటుంది అని చెప్పుకొచ్చారు మేకర్స్. ఇక దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత కోపం వచ్చేసింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ కు బాలీవుడ్ మీద ఆసక్తి తగ్గిపోయిందని, ఇకనుంచి ఎటువంటి బాలీవుడ్ సినిమాను ఒప్పుకోను అని చెప్పినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసాక అభిమానులు.. హమ్మయ్య మంచి పని చేశావ్ అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.