తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుండి ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఈ సమావేశాలు మొత్తం 3 రోజులపాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. సమావేశాల నిర్వహణ కోసం అసెంబ్లీ సిబ్బందికి ఇప్పటికే సంబంధిత ఆదేశాలు జారీ చేయబడినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. తమ నాయకుడు కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపిస్తాం అన్నారు.. అందుకే సీఎం స్పీచ్ ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.