పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో ది అవతార్’ ఈ సినిమా ఈ నెల 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని కూడా ఎంతో గ్రాండ్ గా మొదలు పెడుతున్నారు మేకర్స్. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. రీసెంట్ గా థమన్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ త్రివిక్రమ్ గారు బ్రో సినిమా స్క్రీన్ ప్లే రాసి చెప్పినప్పుడే మూవీ టీం అందరికి గూస్ బంప్స్ వచ్చాయి.ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుంది.. కుటుంబ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.. జీవితం విలువ ఏంటో తెలిసేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. బ్రో సినిమా పై థమన్ చేసిన వ్యాఖ్యలు సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగేలా చేసాయి.ఇందులో పవన్ కళ్యాణ్ మోడరన్ దేవుడి పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. సాయిధరమ్ తేజ్ పాత్ర కూడా ఈ సినిమాలో అదిరిపోతుందని సమాచారం.
ఈ సినిమా నుండి రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అలాగే రీసెంట్ గా ఈ సినిమా నుండి మొదటి పాటను కూడా విడుదల చేసారు మేకర్స్. కానీ ఆ పాటకు మాత్రం అభిమానుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఈ విషయాన్నీ థమన్ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో కూడా ఒప్పుకున్నాడు.రీసెంట్ గా విడుదల చేసిన పాట అభిమానులకు నచ్చలేదని, అన్నీ పాటలు అభిమానులకు నచ్చాలని రూల్ ఏమి లేదని, ఆ తర్వాత వచ్చే పాట మాత్రం అభిమానులను కచ్చితంగా మెప్పిస్తుంది అని ఆయన తెలిపారు .బ్రో సినిమా మోషన్ పోస్టర్ లో వచ్చే శ్లోకం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది.ఈ శ్లోకం ఫుల్ వెర్షన్ ని ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.మరీ థమన్ చెప్పినట్లు గా ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.