ప్రియురాలి కోసం ఆమె ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మానాన్నకు దొరికిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది కదా. అయితే నిజంగానే ఓ యువకుడికి ఆ పరిస్థితి ఎదురయ్యింది. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీడియో ప్రకారం ఓ యువకుడు తన లవర్ ను కలిసేందుకు వెళ్లి ఆమెతో ఉన్న సమయంలో యువతి అమ్మనాన్నకు తెలిసినట్టుగా అర్థం అవుతుంది. యువతి తల్లిదండ్రులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా లోదుస్తులతోనే బాల్కనీ నుంచి ఓ తాడుతో కిందకు దిగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అతని ప్రేయసి అతని బట్టలను కిందకు విసిరేస్తూ ఉంటుంది. పై నుంచి అతడిని పట్టుకోవడానికి యువతి తండ్రి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతడు చిక్కకుండా తాడు సాయంతో కిందకు దిగుతూ ఉంటాడు. అయికే ఒక ఫ్లోర్ కిందకు రాగానే తాడుతో వేలాడుతున్న అతడిని యువతి తల్లి చిపురుతో కొడుతూ ఉంటుంది.
Also Read: Viral News:భర్తకు విషం కలిపిన కాఫీ ఇస్తున్న భార్య… అతను ఏం చేశాడంటే?
అయితే అతడు సేఫ్ గా కిందకు దిగాడా లేదా అన్నది మాత్రం వీడియోలో తెలియడం లేదు. అయితే ఈ వీడియో చూసిన వారు మాత్రం పగలబడి నవ్వుకుంటున్నారు. ఎంజాయ్ చేసినప్పుడు ఈ మాత్రం కష్టాన్ని ఎదుర్కోకక తప్పదు అంటూ కామెంట్ చేస్తున్నారు. పాపం భయ్యా బాగా బుక్కై పోయావంటూ మరికొందరు జాలి చూపిస్తున్నారు.
https://twitter.com/Enezator/status/1689554823568388098?s=20