Bomb Blast: పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయం సమీపంలో జరిగిన పేలుడులో ముగ్గురు చైనా పౌరులు మరణించారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రాత్రి 11 గంటల సమయంలో పోర్ట్ ఖాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన చైనా ఉద్యోగులతో వెళ్తున్న కాన్వాయ్‌పై దాడి జరిగిందని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్‌లోని చైనా ఎంబసీ, కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు. ఈ పేలుడులో మరణించిన చైనా బాధితులకు రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతిని తెలిపింది. అలాగే క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Water Bottle Cap Colors: వాటర్ బాటిల్ క్యాప్స్ రంగులలో తేడాలు ఉన్నాయని ఆలోచించారా? అలా ఎందుకంటే?
ఈ దాడిపై క్షుణ్ణంగా విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని చైనా రాయబార కార్యాలయం పాకిస్థాన్‌ను కోరింది. పాకిస్తాన్ తన దేశంలో ఉన్న చైనీస్ పౌరులు, సంస్థలు, ప్రాజెక్ట్‌లను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఎంబసీ తెలిపింది. ఈ దాడి పరిణామాలను కనుగొనగడానికి మేము పాకిస్తాన్‌తో కలిసి సాధ్యమైన సహాయం చేస్తామని తెలిపింది. ఇకపోతే ., ఆదివారం రాత్రి 11 గంటలకు కరాచీ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడును పాకిస్థాన్ ఉగ్రవాద దాడిగా పేర్కొంది. పాక్ మీడియా ప్రకారం, ఈ దాడికి పాకిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బాధ్యత వహించింది. విమానాశ్రయం వెలుపల ట్యాంకర్‌లో ఈ పేలుడు సంభవించింది. అలాగే, విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ప్రావిన్షియల్ హోం మంత్రి జియా ఉల్ హసన్ తెలిపారు.
Three foreign nationals died & 17 are seriously injuries in a bomb blast at Karachi airport.
Many world leaders including Indian MEA @DrSJaishankar are visiting Pakistan for SCO meeting.pic.twitter.com/OIRFXSLr9V
— Mr Sinha (@MrSinha_) October 7, 2024