Site icon NTV Telugu

Maheshwar Reddy: దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చ‌ర్యతో స‌మానం..

Maheshwar Reddy

Maheshwar Reddy

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తుందని విమర్శించారు. సీఎం శిఖండి రాజ‌కీయాలు చేస్తున్నారని.. ఆప‌రేష‌న్ సిందూర్ ఆగిపోలేదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంత‌మొందించేంత వ‌ర‌కు కొన‌సాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబ‌ద్ధాల‌ను ప్రచారం చేస్తున్నారని.. దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చ‌ర్యతో స‌మానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశ‌ప్రజ‌లంతా అండ‌గా నిలబడి తిరంగా ర్యాలీలు చేస్తున్నారని.. కాంగ్రెస్ నేత‌లు జైహింద్ ర్యాలీల పేరుతో పాకిస్థాన్ పాట పాడుతున్నారని ఆరోపించారు.

READ MORE: Ponguleti Srinivas Reddy: “జాబితా ఫైనల్ అయ్యింది”.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..

కాంగ్రెస్ పార్టీ దివాళాకోరు రాజ‌కీయాలు చేస్తుందని.. దేశ‌భ‌ద్రత‌, విదేశాంగ వ్యవ‌హారాల‌ను కాంగ్రెస్ రాజ‌కీయం చేయ‌డం సిగ్గుచేటని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పాకిస్థాన్ కాల్పుల విరమ‌ణ అంటూ కాళ్ల బేరానికి వ‌చ్చిందని గుర్తు చేశారు. వాస్తవాలు తెలియకుండా కాంగ్రెస్ నేత‌లు త‌ప్పుడు కూత‌లు కూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే.. భార‌త జాతీయ కాంగ్రెస్‌ను.. కాస్తా పాకిస్థాన్ జాతీయ కాంగ్రెస్‌గా మార్చుకున్నట్లు ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. హ‌స్తం పార్టీది ఎప్పుడూ పాకిస్థాన్ అనుకూల విధాన‌మే అని.. తొలి ప్రధాని నెహ్రూ నుంచి కాంగ్రెస్ ది హిందూ వ్యతిరేక‌ విధానమే అని ఆరోపించారు. పాకిస్థానుతో యుద్ధం చేసిన ఇందిరాగాంధీ పీఓకే- పాక్ ఆక్రమిత క‌శ్మీరును ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణ‌చివేయ‌డంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ చేసిన చారిత్రక త‌ప్పిదాల‌ను ప్రధాని మోడీ స‌రిదిద్దుతున్నారన్నారు. క‌శ్మీరు విష‌యంలో అమెరికా జోక్యం చేసుకుంద‌ని కాంగ్రెస్ నేత‌లు త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారని… యుద్ధాన్ని ఆప‌మ‌ని పాకిస్థాన్ ప్రాథేయ‌ప‌డిందన్నారు. ఉగ్రవాదాన్నీ అంత‌మొందించేంత వ‌ర‌కు ఆప‌రేష‌న్ సింధూర్ కొన‌సాగుతుందని స్పష్టం చేశారు.

READ MORE: PM Modi: మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రశంసించిన ప్రధాని

Exit mobile version