రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తుందని విమర్శించారు. సీఎం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు కొనసాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని.. దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశప్రజలంతా అండగా…