Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతల కీలక భేటీ అయ్యారు. ఇప్పటికే ఢిల్లీకి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో రాష్ట్ర నేతల ప్రత్యేక భేటీ అయ్యారు. తెలంగాణలో రూట్ మ్యాప్, అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. తొలిజాబితాలో కనీసం 35 మంది పేర్లు ఉన్నాయనే ప్రచారం మొదటి పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఈరోజు జాబితా ప్రకటిస్తే 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఇతర పార్టీల అసంతృప్తి నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం కానుంది. అయితే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ పై నిన్న రాత్రి కిషన్ రెడ్డి నివాసంలో సుదీర్ఘంగా సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
అయితే తొలి జాబితాలో ఎలాంటి వివాదాలు, ఇతర పార్టీల వలసలు లేకుండా అసెంబ్లీ స్థానాల జాబితాను ప్రకటించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఇవాళ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కాశీ పార్టీ అగ్రనేతలు పార్టీ నేతలకు రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి బీజేపీ నాయకత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి గరిష్టంగా 66 దరఖాస్తులు వచ్చాయి.
తెలంగాణలో ఈ దఫా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలదళం పట్టుదలతో ఉంది. దీంతో రాష్ట్రంలో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా దృష్టి సారించింది. గతంలో జరిగిన హుజూరాబాద్, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేట్ సీట్లను గెలుచుకుంది. దీంతో బీజేపీ అధిష్టానం గత కొంత కాలంగా తెలంగాణపై ఫోకస్ పెంచింది. గతంలో యూపీలో పనిచేసిన సునీల్ భన్సాల్ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో పనిచేస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాలపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. దక్షిణాదిలో కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. దీంతో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఈ నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు రాష్ట్రానికి వచ్చారు. తెలంగాణ ప్రజలపై వరాలు కురిపించారు. నిజామాబాద్‌లో జరిగిన సభలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 6న జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
KTR Tweet: కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సు.. కేటీఆర్ సెటైరికల్ ట్విట్..