తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీహార్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో బుధవారం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్, డీఎంకే నేతలు గతంలో బీహారీయులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ గుర్తు చేసింది. వీటికి సమాధానం ఏదంటూ నిలదీస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఫ్రెస్టేజీగా తీసుకుంది. అధికారం చేజిక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ఉచిత పథకాలతో ఓటర్లకు ముందుకు వచ్చింది.
జార్ఖండ్‌లో బీజేపీ దూకుడుగా ఉంది. శుక్రవారం పొత్తులు ఖరారు చేసుకుంది. గంటల వ్యవధిలోనే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేసింది. శనివారం సాయంత్రం 66 మందితో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండో జాబితాను మంగళవారం బీజేపీ ప్రకటించింది. 21 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను వెల్లడించింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 88 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 9 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. కేవలం తమిళనాడుకు చెందిన అభ్యర్థులనే బీజేపీ వెల్లడించింది.