మాజీ ప్రధాని ఇందిరాగాంధీని "భారతమాత" అని కేంద్రమంత్రి సురేష్ గోపీ శనివారం వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీకి 'తల్లి' అని అన్నానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈరోజు మీడియాకు తెలిపారు. తాను హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తినని.. ఇందిరా గాంధీ గురించి తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా... కేరళలో కాంగ్రెస్ పార్టీకి తండ్రి కె. కరుణాకరన్.. భారతదేశంలో…
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'భారతమాత'గా అభివర్ణించారు కేంద్రమంత్రి సురేష్ గోపి.. అంతేకాకుండా.. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్‌ను 'ధైర్యవంతమైన నిర్వాహకుడు' అని కొనియాడారు. కరుణాకరన్, ఇకె నాయనార్ తన "రాజకీయ గురువులు" అని అన్నారు. పున్‌కున్నంలో ఉన్న కరుణాకరన్ స్మారకం "మురళీ మందిరం"ని సందర్శించిన అనంతరం మంత్రి సురేష్ గోపి విలేకరులతో మాట్లాడారు.