Site icon NTV Telugu

MP Laxman: పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం దేనికి సంకేతం?.. రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఫైర్..

Mp Laxman

Mp Laxman

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైన ఆరోపణలన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాపెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఆర్మీ మనోభావాలను గాయపర్చడమే కాకుండ.. దేశాన్ని అవమానించే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, బీజేపీపై ఉన్న అక్కసును ఆర్మీ మీద, దేశంపైన వెల్లగక్కుతున్నారన్నారు. పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడటం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నారని.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారత పౌరులు అంతా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని పిలపునిచ్చారు. యుద్ధంలో ఒక్క విమానం కూడా కూలిపోలేదని స్పష్టం చేశారు.

READ MORE: Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపు..

కాగా… మే 29న హైదరాబాద్‌లోని ‘జై హింద్’ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్థాన్ చేతిలో ఎన్ని రాఫెల్ విమానాలు కూలాయనే విషయంపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “సికింద్రాబాద్ కంటోన్మెంట్ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. తెలంగాణలో తయారైన విమానాలు దేశ గౌరవాన్ని నిలబెట్టాయి. కానీ, మోడీ తెచ్చిన రాఫెల్ విమానాలను పాకిస్థాన్ కూల్చివేసింది. ఎన్ని కూలాయనే దానిపై చర్చ లేదు. మోడీ జవాబు చెప్పాలి” అని రేవంత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

READ MORE: CM Chandrababu: కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాం..!

Exit mobile version