బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం లేదు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని అందరికీ తెలుసు.. అప్పుల కుప్పగా మారిందని, నష్టాల్లో ఉందనే నేపం మోపి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
Read Also: TS Assembly: గరం గరంగా అసెంబ్లీ.. కేటీఆర్, హరీష్ పై రేవంత్ ఫైర్
గవర్నర్ తమిళిసై ప్రసంగంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశాల ప్రస్తావన లేదు అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యచరణ లేదు.. పోలీస్ స్టేషన్ లో గిరిజన యువకుడు లాకప్ డెత్ జరిగింది.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. మొదటి కేబినెట్ లో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు.. దాని ఊసే లేదు.. కర్ణాటకలో ప్రైవేట్ ట్రాన్స్ ఫోర్టుపై ఆధారపడి బతుకుతున్న వారు ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరిస్తుంది.. ఇచ్చిన హామీలు.. షాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు.